స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. ఎక్కడకెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఏం చేయబోతున్నా.. స్మార్ట్‌ఫోన్ మన వెంట ఉండాల్సిందే.. తింటున్నా.. పడుకున్నా.. నలుగురిలో ఉన్నా.. ఒంటరిగా ఉన్నా.. స్మార్ట్‌ఫోన్ మీద చేతి వేళ్లను అటు ఇటు కదపాల్సిందే.. మన జీవితంలో మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ అత్యవసర సాధనంగా మారింది.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్.. లేకుండా ఉండటం అసాధ్యం అనేలా మన జీవితం కూడా మారిపోయింది.. పగలు లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారిని మీరు చాలా మందిని చూసి ఉంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఫోన్లు ఉపయోగిస్తున్నారు.. సోషల్ మీడియాను స్క్రోలింగ్ చేస్తున్నా, గేమ్‌లు ఆడుతున్నా, సినిమాలు చూస్తున్నా, మరేదైనా పని చేస్తున్నా జనం నిత్యం తమ ఫోన్‌లతో బిజీగా ఉంటుననారు.. స్మార్ట్‌ఫోన్‌లు దాదాపు అన్ని పనులకు ఉపయోగకరంగా మారుతున్నాయి..
ఇలా స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది అనేక విధాలుగా ప్రజలకు సహాయపడుతుంది. ఫోన్ ప్రజలకు అనేక పనులను సులభతరం చేస్తుంది. కానీ, కొందరు మాత్రం ఫోన్‌ను అతిగా ఉపయోగిస్తున్నారు.. రోజంతా తన ఫోన్ ను చూస్తున్నారు.. ఇది అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కళ్లకు చాలా హాని కలుగుతుందని, చాలా రకాల కంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో చూడండి..
కళ్లు పొడిబారడం : స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఫోకస్ చేస్తున్నప్పుడు మనం తక్కువ సార్లు కనురెప్పలను మూసివేస్తాము.. దీని వల్ల కళ్లు పొడిబారిపోయే అవకాశం ఉంది..
ఇవి కూడా చదవండి
కంటి నొప్పి – చికాకు : స్క్రీన్‌పై నిరంతరం చూడటం కంటి ఒత్తిడికి కారణమవుతుంది.. ఇది నొప్పి – చికాకును కలిగిస్తుంది.
అస్పష్టమైన దృష్టి : ఎక్కువసేపు చిన్న స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై దృష్టి కేంద్రీకరించడం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి.. దీంతో కళ్లు అస్పష్టంగా కనిపిస్తాయి.
తలనొప్పి : కంటి ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి కూడా రావచ్చు. నిరంతరం చూడడం వల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది..
నిద్రలేమి : స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే కాంతి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది.
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది.
మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వండి : స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే మధ్య, కొంత సమయం పాటు మీ కళ్లను మూసుకుని విశ్రాంతి తీసుకోండి.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి : స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
నీలి కాంతిని ఫిల్టర్ చేయండి : మీరు నీలి (బ్లూ లైట్) కాంతిని ఫిల్టర్ చేసే అద్దాలు లేదా స్క్రీన్ ప్రొటెక్టర్‌లను ఉపయోగించవచ్చు.
మీ కళ్ళను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి : సంవత్సరానికి ఒకసారి మీ కళ్ళను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి