అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్

2 hours ago 1

అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! 'రోలెక్స్' సినిమాపై సూర్య అప్డేట్

|

Updated on: Oct 24, 2024 | 9:49 AM

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలు, కమల్ పాత్ర, ప్రతీకార కథ అన్నీ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ చివరి ఐదు నిమిషాల్లో సూర్య ప్లే చేసిన రోలెక్స్ పాత్ర హైలెట్ అయ్యింది. ఇందులో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించాడు సూర్య.

ఈ పాత్ర తెరపై చివరి రెండు నిమిషాలు మాత్రమే కనిపించినప్పటికీ.. జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ క్యారెక్టర్‌ని పెట్టుకుని సెపరేట్ సినిమా చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయంపై సూర్య స్పందించాడు. సూర్య నటించిన కంగువ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సూర్యకు ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ పాత్ర గురించిన ప్రశ్న ఎదురైంది. . ‘రోలెక్స్’ భవిష్యత్తు ఎలా ఉంటుంది? రోలెక్స్‌ను మళ్లీ తెరపై చూడగలమా? అని యాంకర్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూర్య. . ‘రోలెక్స్ పాత్ర కోసం అరరోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే అరరోజు కష్టపడితే అభిమానుల నుంచి ఇంత ప్రేమ, మద్దతు లభిస్తుందని ఊహించలేదు. ‘రోలెక్స్’ పాత్రను బేస్ చేసుకుని లోకేష్ కనగరాజ్ స్టాండ్ ఎలోన్ సినిమా గురించి నాతో చర్చించారు. ఈ విషయంపై రెండుసార్లు చర్చలు జరిపాం.. కానీ ఏదీ ఖరారు కాలేదు’ అంటూ రోలెక్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు సూర్య. ఇక ముందు ‘రోలెక్స్’ చేయాలా లేక ‘ఇరుంబు కై మాయావి’ చేయాలా అనేది నిర్ణయించుకోవాలన్నారు. ‘ఇరుంబు కై మాయావి’ చిత్రం.. చేయి కోల్పోయిన ఓ సూపర్‌హీరో కథ. ఈ సినిమాలో సూర్య హీరో,లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అయితే ఆ సినిమా కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదని సూర్యే చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karthi Satyam Sundaram OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. అప్పుడే OTTలోకి సత్యం సుందరం మూవీ

క్రేజీ న్యూస్.. NTR సినిమాలో షారుఖ్ ఖాన్

Chandrababu Naidu Season 4: తన అరెస్ట్ గురించి చెబుతూ చంద్రబాబు ఎమోషనల్

వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??

Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article