నేచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా కనిపిస్తూ.. తన సహజ నటతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఫిదా సినిమాతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టీ, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ మూవీలో అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
Updated on: Feb 10, 2025 | 8:28 PM
ఇక ప్రస్తుతం ఈ నటి వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఫిదా తర్వాత ఎమ్‌సీఏ,లవ్ స్టోరీ, అమరన్ , శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, పడి పడి లేచే మనసు వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈముద్దుగుమ్మ.
1 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన తండేల్ మూవీ రీసెంట్‌గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంతే కాకుండా ఈ మూవీలో సాయిపల్లవి నటకు మంచి మార్కులే పడ్డాయి.
2 / 5
ఇక ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడు చాలా జోరుగా పాల్గొంది.
3 / 5
అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా, సాయిపల్లవి తన అభిమానులతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో తకు ఏ హీరో అంటే ఇష్టమో చెప్పేసింది ఈ బ్యూటీ.
4 / 5
సాయిపల్లవి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని. రిలీజైన రోజే ఆయన ప్రతీ సినిమా చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆయన యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం సాయిపల్లవి చేసి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
5 / 5