దీంతో భూమిలాంటి మరో గ్రహాన్వేషణ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే తెరమీదకు వచ్చింది ప్రాజెక్ట్ హైపేరియన్. అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ గొడ్డార్డ్ దీనికి రూపకర్త. రోదసిలో నిర్మించే నగరాన్నే ‘ప్రాజెక్టు హైపేరియన్’ లేదా ‘ప్రాజెక్టు టైటన్’గా పిలుస్తున్నారు. భూమి మీద ఓ టౌన్‌లో ఉండే అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఆకాశంలో ఓ స్పేస్‌షిప్‌లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి. భూమి మీద వ్యవసాయం చేసినట్టే అక్కడా సాగు చేయొచ్చు. ఉద్యోగం, పిల్లల చదువులు, సినిమాలు-షికార్లు, రోగాలొస్తే దవాఖానలు, జంతువులు, చెట్ల పెంపకం ఇలా ఒక్కటేమిటీ అన్నిరకాల సదుపాయాలు ఆ నగరంలో అందుబాటులో ఉంటాయి. కనీసం 250 ఏండ్లపాటు మనుగడ సాగించేలా ఈ నగరాన్ని నిర్మించనున్నట్టు ‘ప్రాజెక్టు హైపేరియన్’ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రకృతి విపత్తులు, ప్రళయం, బయోవార్, కరోనా వంటి వైరస్‌ల వ్యాప్తి, అణుయుద్ధాలు వంటివి సంభవించినప్పుడు భూమి మీద జీవజాలం అంతరించిపోకుండా ఉండేందుకే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. స్పేస్‌షిప్ నడవడానికి ఇంధనం, నగరంలో గాలి, నీటి శుద్ధి, వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడం, రోదసిలోని రేడియేషన్ ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యర్థాల నిర్వహణ ఇలా పలు సవాళ్లు ఈ ప్రాజెక్టు ముందడుగులో అడ్డుపడుతున్నాయి. అయితే, త్వరలోనే వీటికి తగిన పరిష్కారం చూపిస్తామని, దీనికోసం అవసరమైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్టు ‘ప్రాజెక్టు హైపేరియన్’ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆసక్తి కలిగినవారు సవాళ్లకు పరిష్కారాలతో పాటు స్పేస్‌షిప్ డిజైన్‌లను జూన్ 2, 2025లోపు తమకు పంపించాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
వాట్సాప్‌లో సీక్రెట్ చాటింగ్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది ??