ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

2 hours ago 1

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

|

Updated on: Oct 27, 2024 | 9:53 PM

మన దేశం ఎన్నో భాషల, ఎన్నో మతాల ఎన్నో సంప్రదాయాల సమాహారం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే భాషతో సహా ఎన్నో విషయాలు చాలా కొత్తగా ఉంటాయి. మిగతా విషయాల సంగతెలా ఉన్నా భాష విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతుంటారు.

ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆటో డ్రైవర్ వెనుక సీటుకు ఓ బోర్డ్ తగిలించి ఉంది. ఆ బోర్డు మీద ఇంగ్లీష్ వాక్యాలకు కన్నడ అనువాదం ఉంది. సాధారణంగా ఆటో డ్రైవర్‌తో ప్యాసింజర్లు మాట్లాడే మాటలకు కన్నడ అనువాదం ఉంది. పైన ఆంగ్లంలో వాక్యాలు రాసి, కింద వాటి కన్నడ అనువాదం రాశారు. “సర్, డ్రైవ్ ఏ లిటిల్ ఫాస్టర్“, “సర్, హౌ మచ్ ఈజ్ ఇట్“, “డూ యూ యాక్సెప్ట్ యూపీఐ ఆర్ క్యాష్ ఓన్లీ“ వంటి వాక్యాలను కన్నడలో ఎలా పలకాలో బోర్డు మీద రాసి దానిని ప్యాసింజర్లకు కనబడేలా తన సీటు వెనుక తగిలించాడు. ట్విటర్‌లో షేర్‌ అయిన ఫొటోకు “చాలా ఉపయోగకరం“ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 24 లక్షల కంటే ఎక్కువ మంది ఆ పోస్ట్‌ను వీక్షించారు. పోస్ట్‌పై కొందరు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. “నో సర్, 2 కిలోమీటర్లకు రూ.600 చెల్లించలేను అని ఎలా చెప్పాలో ఇక్కడ రాయలేదు“, “అంతా బాగానే ఉంది. కానీ, ప్రతి వాక్యం ముందు “సర్, సర్“ అని ఉందేంటి. ఆటో డ్రైవర్‌తో కాకుండా బాస్‌తో మాట్లాడుతున్నట్టు ఉంది“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..

‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన నయన్‌

కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే !!

అయ్యబాబోయ్‌.. ఇంట్లో కి వెళ్లగానే యజమానికి భారీ షాక్‌

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article