ఆడపిల్లల పాలిట తోడేళ్లు.. మతి తప్పిన మదపిచ్చోళ్లు… ఒక్కోడు ఒక్కో టైపు

3 hours ago 1

వందమంది అమ్మాయిలే నా టార్గెట్‌ అంటాడొకడు. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే విశ్రమిస్తానంటాడు ఇంకొకడు. అపరిచితుడి వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మానప్రాణాల్ని పణంగా పెట్టి కోట్లు కొల్లగొడతాడు ఇంకొకడు. వయసు మళ్లిన ముసలావిడ మీద కూడా అఘాయిత్యానికి పాల్పడతాడు మరొకడు. పశువుల్ని కూడా వదిలిపెట్టనంత క్రూరంగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి పట్టి ఊరుమీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే ఏం చెప్పగలం.

మగాళ్ల ముసుగుతన్ని.. ఆడపిల్లల పాలిట తోడేళ్లుగా మారుతున్న వైల్డ్ ఎనిమల్స్ మన సమాజంలో మన మధ్యనే మన చుట్టూనే యదేఛ్చగా తిరుగుతున్నారు. ఒక్కటొక్కటిగా బైటికొస్తున్న క్రైమ్ కహానీలు.. వాటి మాటున నక్కి ఉండే కామాంధుల కథలు.. నైతికంగా మనమెక్కడున్నామో నిగ్గదీసి అడిగేస్తున్నాయి. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో వెలుగుచూసిన కొన్ని నికృష్టమైన ఉదంతాలు.. సమాజాన్ని చీడపురుగులు ఎంత పట్టిపీడిస్తున్నాయో అర్థమౌతోంది.

బత్తుల ప్రభాకర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్… 80కి పైగా కేసులున్న ఘరానా దొంగ.. మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ.. ఎట్టకేలకు గచ్చిబౌలిలోని ఓ పబ్బులో దొరికాడు. పోలీసులపైనే ఫైరింగ్ చెయ్యబోయి.. అరెస్టయ్యాడు. రిమాండ్‌కు తరలించారు. అతగాడుండే రూమ్‌కి వెళ్లి వాడి క్రిమినల్ నేచర్ చూసి పోలీసులే షాకయ్యారు. నెలకు లక్ష రూపాయలు అద్దె ఇస్తూ.. ఖరీదైన ఇంట్లో లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాకర్‌కి సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి సింగిల్‌గానే దొమ్మీలు, దోపిడీలు చేయడం హాబీ. ఇంతేకాదు.. బత్తుల ప్రభాకర్ అనే ఈ నేరగాడికి ఇంకో మాయరోగం కూడా ఉంది. అతడి ఛాతీ మీదుండే టాటూల్ని డీకోడ్ చేస్తే.. విస్తుగొలిపే విషయాలు తెలిసొచ్చాయి. ముఖ్యంగా ఎడమవైపు ఆఠీను గుర్తుతో కూడిన ఆ వన్‌డబుల్‌జీరో కథేంటి..? వందమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయాలన్నది తన టార్గెట్ అట. గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుని మరీ టార్గెట్ పెట్టుకున్నాడంటే.. ఈ కామాంధుడి మురికి లీలామృతం ఏ పాటిదో అర్థమౌతోంది. ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్లల జీవితాల్ని కబళించాడు.. వీడి రాడార్‌లో ఇంకెంతమంది అమ్మాయిలున్నారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు.

Battula Prbhakar

Battula Prbhakar

మస్తాన్‌ సాయి అనే ఇంకొకడి టార్గెట్టయితే అంతకుమించి. ఏకంగా 300 మంది అమ్మాయిల పరువుని బ్లూఫిలింస్‌లో దాచిపెట్టాడీ కసాయిగాడు. లావణ్య-రాజ్‌తరుణ్ లవ్వాయణంలో వెలుగుచూసిన ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ పేరే మస్తాన్ సాయి. ఇంతవరకూ లావణ్య జీవితంలో మాత్రమే తనదైన పాత్ర పోషించిన ఇతగాడి మీద లేటెస్ట్‌గా మరో కేసు నమోదైంది. ఆ కేసు డీటెయిల్స్ చూస్తే.. కళ్లు బైర్లు గమ్ముతాయ్.

వందకాదు రెండొందలు కాదు.. ఏకంగా 300మంది అమ్మాయిల బతుకుల్ని బజారుకీడ్చిన శాల్తీ ఇది. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపడం.. పెళ్లి చేసుకుంటానని.. యూట్యూబ్‌లో అవకాశాలిస్తానని ఆశ పెట్టడం.. ఇదీ వీడి వెలగబెడుతున్న ప్రొఫెషన్. కొందరమ్మాయిల్ని శారీరకంగా వాడుకుని, డ్రగ్స్‌కి బానిసలుగా మార్చి.. వీడియోకాల్స్‌ ద్వారా అశ్లీల చేష్టలకు పాల్పడి సదరు వీడియోల్ని తన దగ్గర భద్రపర్చుకోవడం.. ఇదే ఇతగాడి మేనరిజం.

బాత్రూముల్లో, బెడ్‌రూముల్లో స్పైకెమెరాలతో రికార్డ్ చేసిన వీడియోల్ని హార్డ్‌డిస్క్‌లో దాచుకున్నాడు. తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిల వ్యక్తిగత రహస్యాలన్నీ వీడి మెమరీ కార్డులో ఉండిపోయాయి. ఎవరైనా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే వీడియోల్ని పబ్లిక్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్‌కి దిగుతాడు. రాజ్‌తరుణ్ కేసులో ఆధారాల కోసం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్యకు… అందులో ఉన్న వీడియోల్ని చూశాక మైండ్ బ్లాకైంది. 300 మంది అమ్మాయిల వీడియోలున్న ఆ హార్డ్ డిస్క్ ఇప్పుడు నార్సింగి పోలీసుల హ్యాండోవర్లో ఉంది. మస్తాన్ సాయి ట్రాప్‌లో చిక్కిన ఆ 300 మంది అమ్మాయిలిప్పుడు బితుకుబితుకుమంటూ బతుకుతున్నారు.

Mastan Sai

Mastan Sai

పేరు దేవనాయక్. ఈ కథలో వీడిది అపరిచితుడి క్యారెక్టర్. ఒక అమాయక మహిళను స్నేహం పేరుతో నమ్మించి, న్యూడ్ వీడియోలు తీసి, బెదిరించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు. హైదరాబాద్‌ అమ్మాయి.. నిడదవోలు అబ్బాయి. ఇదీ కథ పేరు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ విమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న ఒకమ్మాయికి అనూష అనే మరొకమ్మాయి పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన మరోకడు దేవనాయక్. మాటామాటా కలిపి.. ఎనీటైమ్ ఏదైనా అవసరమొస్తే చెప్పు.. ఆదుకుంటా అంటూ ఆపద్బాంధవుడిలా ఫోజు కొట్టేవాడు.

వన్ ఫైన్ మార్నింగ్ ఒక అగంతకుడి నుంచి ఫోన్ కాల్.. నీ న్యూడ్ ఫోటోలు నా దగ్గరున్నాయని బెదిరింపు. అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్..! భీతావహురాలైన అమ్మాయి.. సాయం కోసం దేవనాయక్‌ను ఆశ్రయించింది. వాడి అంతు చూస్తా.. సెటిల్ చేస్తా అంటూ నమ్మబలికాడు దేవనాయక్. ఇదే అదనుగా.. కొంత ఖర్చవుతుంది అంటూ ఆమె దగ్గరనుంచి డబ్బులు రాబట్టుకోసాగాడు. సెటిల్మెంట్ విషయంలో గొడవ జరిగిందని, దెబ్బలు తగిలాయని, ఆస్పత్రి ఖర్చులని చెప్పి మరికొంత డబ్బు తీసుకున్నాడు. తీరా ఆరా తీస్తే.. ఫోన్ చేసి బెదిరించిన అగంతకుడే ఈ దేవాంతకుడని, అసలు సూత్రధారి ఈ అపరిచితుడేనని తెలిసి షాకయింది ఆ అమ్మాయి. నిడదవోలు పోలీసులు ఆశ్రయించి.. జరిగిందంతా చెప్పేసింది. కానీ.. అప్పటికే న్యూడ్‌ఫోటోల్ని చూపెట్టి.. 2 కోట్ల 53 లక్షలు లాగేసుకున్నాడు.

Deva Nayak

Deva Nayak

మద్యం మత్తులో మృగంలా మారతాడు

వీడి పేరు మంజు.. కేరాఫ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు. మద్యానికి బానిసై ఒళ్లు కొవ్వెక్కి.. కళ్లనిండా కామక్రోధాలు నింపుకుని.. జులాయిగా తిరుగుతుంటాడు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై తెగబడి అత్యాచారం చేసి హతమారుస్తాడు. 2023లో 85 ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారం చేస్తే.. ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గత ఏడాది మార్చిలో మరొక వృద్ధురాలిని కూడా ఇలాగే చేశాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదిగా ఉన్న మంజు ఈ నెల 1న బెయిల్‌పై విడుదలయ్యాడు. వీడు జైలుకెళ్లొచ్చినా వాడిలోపలుండే మృగం అలాగే ఉంది.

పెదనందిపాడులో ఒక గుడిలో పనిచేసే రమణమ్మ అనే ముసలావిడ చనిపోయింది‌. ఆమె మెడపై తీవ్ర గాయాలుండడంతో అనుమానమొచ్చి పోలీసులు ఆరా తీశారు. ఆ ఇంటి సమీపంలోనే మంజు, అతని స్నేహితుడు సాంబ ఉండటంతో అనుమానం బలపడింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు రాసుకుని దర్యాప్తు చేస్తే.. రమణమ్మపై అత్యాచారం చేసింది మంజునే అని తేలింది. వాడి పేరు తలిస్తేనే వణుకుతోంది పెదనందిపాడు గ్రామం.

Manju

Manju

ఇలా కామ పిశాచులు పేట్రేగి పోవడం.. తెలుగు రాష్ట్రాల్ని కలవర పెడుతోంది. మతి తప్పిన.. మదమెక్కిన కామాంధులు ఎక్కడెక్కడ నక్కివున్నారో.. ఎప్పుడు ఎలా ఎవరి మీద తెగబడతారో అని బెదిరిపోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేయడానికి టార్గెట్ పెట్టుకుని మరీ వేటాడుతున్న తోడేళ్ల గురించి జనంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article