ప్రస్తుత జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. ఒకసారి షుగర్ ఎటాక్ చేసిందంటే..దాన్ని పూర్తిగా నిర్మూలించటం అసాధ్యం. ఎందుకంటే ఇప్పటికీ దానికి సరైన మందు అందుబాటులో లేదు.. కానీ, కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. షుగర్ బాధితులు ఆహారం తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మధుమేహ రోగులు తినడం, త్రాగడంలో చిన్న పొరపాటు చేసినా అది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, డయాబెటిస్ ఉన్నవారు వారి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో రుచికరంగా, ఆరోగ్యంగా ఎలాంటివి తినాలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మధుమేహులకు అనుకూలమైన అల్పాహారం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
* రాగి ఓట్స్ దోస:
దీనికి కావాల్సిన పదార్థాలు..
ఇవి కూడా చదవండి
రాగి పిండి – 1 కప్పు,
ఓట్స్ – 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినది)
తురిమిన అల్లం – 1 స్పూన్
జీలకర్ర పొడి – 1 స్పూన్
మజ్జిగ – 2 కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – అవసరానికి సరిపడా
నూనె – అవసరానికి సరిపడా
తయారీ విధానం: రాగి ఓట్స్ దోస చేయడానికి ముందుగా ఓట్స్‌ను పాన్‌లో లైట్‌గా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో రుబ్బుకుని, పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో రాగి పిండి, ఓట్స్ పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత మజ్జిగ, నీళ్లు కొద్దికొద్దిగా పోసి దోసె పిండిలా మందపాటి పిండిలా కలపండి. ఇప్పుడు పాన్ వేడి చేసి దానిపై నూనె రాసి తయారుచేసిన మిశ్రమాన్ని దోసెలాగా పోసుకోవాలి. రెండు వైపులా బాగా ఉడికించాలి. రాగి ఓట్స్ దోస రెడీ. ఈ దోసెతో కొబ్బరి చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో తినవచ్చు.
* రాగి ఉత్తపం:
కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం:
రాగి పిండి – 3/4 కప్పు
సెమోలినా – 1/2 కప్పు
పెరుగు – 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ – 1 కప్పు (సన్నగా తరిగిన)
క్యాప్సికమ్ – 1 (సన్నగా తరిగిన)
పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగిన)
క్యారెట్ – 1 (తురిమిన)
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – అవసరానికి సరిపడా
నూనె – అవసరానికి సరిపడా
తయారీ విధానం: దీని కోసం ముందుగా సెమోలినా, పెరుగును బాగా కలపండి. తరువాత రాగి పిండి, పచ్చిమిర్చి, రుచికి తగిన ఉప్పు, నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు దానిని అరగంట పాటు మూత పెట్టి ఉంచండి. అరగంట తర్వాత, పాన్ వేడి చేసి దానిపై నూనె రాసి తయారుచేసిన మిశ్రమాన్ని ఉత్తపంలా వేసుకోవాలి.. దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, తురిమిన క్యారెట్ వేయండి. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. ఉత్తపం ఒక వైపు ఉడికిన తర్వాత, దాన్ని తిప్పి మరోవైపు కూడా ఉడికించాలి. మీరు చట్నీ లేదా సాంబార్‌తో తినవచ్చు.
ఇతర వంటకాలు:
సోయా దోస, రాగి ఇడ్లీ, వర్గు ఉప్మా, గోధుమ దోస, రాగి గంజి, మూంగ్ పప్పు దోస మొదలైనవి మధుమేహ రోగులకు అద్భుతమైన అల్పాహారం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..