ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తోన్న తప్పుడు వార్తలపై బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరాధ్య ఆరోగ్యం గురించి కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తప్పుడు కథనాలు పబ్లిష్ చేసాయి. కొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి. ఈ ఫేక్ న్యూస్‌పై ఆగ్రహించిన బచ్చన్ కుటుంబం, అలాంటి వీడియోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి కల్పిత వార్తలను వ్యాప్తి చేయడాన్ని ఆపాలని కోరింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పుడు మరోసారి ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఆరాధ్య తరపున పిటిషన్ దాఖలు చేశారు ఐశ్వర్య, అభిషేక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్ స్టేట్‌మెంట్లతో..