ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో చేపలు ఒకటి. చేపల్లో అనేక పోషకాలు దాగి ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి.
చేపలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో డిప్రెషన్, టైప్-1 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చేపలలో మెదడుకు మేలు చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. డిమెన్షియా వంటి మతిమరుపును చేపలు నివారిస్తాయి. గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదని చెబుతారు. చేపల్లోని పోషకాలు పిల్లల మెదడు అభివృద్ధి చెందేలా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. తరచూ చేపలు తినటం వల్ల పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్యం మీద పడుతున్నా కొద్ది సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటివారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చేపలతో మెదడు తీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని.. చేపలను వారంలో కనీసం 1 లేదా 2 సార్లు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో IRCTC సూపర్ యాప్ !! అన్ని సేవలు ఒకే చోట
మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీకపూర్ పూజలు