ఎవర్రా వీడు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు.. ఆడింది 8 టెస్టులే.. 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సరికొత్త చరిత్ర

2 hours ago 1

Kamindu Mendis Records: 2022లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల కమిందు మెండిస్ ఇప్పటివరకు 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 4 సెంచరీలు, 4 అర్ధసెంచరీలతో కమిందు వెయ్యికి పైగా పరుగులు రాబట్టాడు. దీని ద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించడంలో ఈ యువ స్ట్రైకర్ సఫలమయ్యాడు.

|

Updated on: Sep 28, 2024 | 10:50 AM

 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ సరికొత్త రికార్డును లిఖించాడు. అది కూడా వరుసగా 8 యాభై ప్లస్ స్కోర్లు సాధించడం ద్వారా. అంటే, టెస్టు క్రికెట్‌లో ఆడిన తొలి 8 మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కమిందు మెండిస్ ఇప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

Kamindu Mendis Records: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ సరికొత్త రికార్డును లిఖించాడు. అది కూడా వరుసగా 8 యాభై ప్లస్ స్కోర్లు సాధించడం ద్వారా. అంటే, టెస్టు క్రికెట్‌లో ఆడిన తొలి 8 మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కమిందు మెండిస్ ఇప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

1 / 5

ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సౌద్ షకీల్ పేరిట ఉంది. పాక్ జట్టుకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తొలి 7 టెస్టు మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కమిందు 8వ సారి యాభైకి పైగా పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

2 / 5

గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో ఐదో స్థానంలో వచ్చిన కమిందు మెండిస్ 250 బంతుల్లో 4 సిక్సర్లు, 16 ఫోర్లతో అజేయంగా 182 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన సెంచరీతో, అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి 8 మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

3 / 5

అంతే కాకుండా, టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలో 2వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో 7 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కమిందు మెండిస్ 8వ మ్యాచ్ ద్వారా 1000 పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

4 / 5

కమిందు మెండిస్ 182 పరుగుల అజేయ సెంచరీ సాయంతో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article