అతి వేగమే అన్ని అనర్థాలకు ముప్పు..! మితిమీరిన వేగం కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది అవయవాలు కోల్పోయి అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబాలు తీరని శోకాన్ని అనుభవిస్తున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒకచోట అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులతో వెళ్తున్న కారు అదుపు తప్పి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోమవారం ఉదయం సోహ్నా-గురుగ్రామ్ ఎలివేటెడ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు విధ్వంసం సృష్టించింది. కారు హై స్పీడ్ కారణంగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు వెళ్లి మరో కారును ఢీకొట్టింది. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన కారు మరో కియా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇంకా అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక్కడ క్లిక్ చేయండి..
गुरुग्राम सोहना एलिवेटेड रोड पर दिल्ली मुम्बई एक्सप्रेस वे के पास दर्दनाक हादसा हुआ जिसमे कार सवार 5 लोगों में से 2 की मौत हो गई और 3 गंभीर घायल हो गए वीडियो में देख सकते है कि बस को Overtake करने के चक्कर में कार Control से बाहर हो गई है । #Newswani #gurugram pic.twitter.com/t3C8kkR1bR
— regular newswani (@DNewswani) November 5, 2024
కారులు వెల్తున్నవారు జీడీ గోయెంకా యూనివర్శిటీ, కేఆర్ మంగళం యూనివర్సిటీ విద్యార్థులు అక్షిత్ (18), దక్ష్ (19) తమ స్నేహితుడు ధ్రువ్‌తో కలిసి కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్షిత్, దక్ష్ అక్కడికక్కడే మృతి చెందారు. ధ్రువ్‌కు తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..