ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. శనివారం సంజయ్‌రాయ్ దోషి అని ఫిక్స్ చేసిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. గత ఏడాది ఆగస్ట్9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్‌రాయ్.. ఆగస్ట్ 10వ తేదీన సంజయ్‌రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న కోర్టు విచారణ ప్రారంభమైంది. పలుమార్లు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చారు. కోర్టులో వాదనలు సందర్భంగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని CBI వాదించింది. అటు.. ఈ కేసులో తీర్పునకు ముందు సంజయ్‌రాయ్ తన వాదన చెప్పుకున్నాడు. విచారణ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు చెప్పాడు. ఎలాంటి కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని అన్నాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని చెప్పాడు.. తాను తప్పు చేసి ఉంటే, రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలని కానీ అలా జరగలేదని అన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రాయ్ బుకాయించాడు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. దోషికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు
రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!
Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
షూటింగ్ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్