వేయించిన శనగలు వీటినే పుట్నాలు అని కూడా అంటారు. వీటితో బెల్లం కలిపి తింటే ఎన్ని లాభాలో తెలిస్తే.. అస్సలు వదులుకోరు. ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. అంతేకాదు.. అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం, వేయించిన శనగపప్పు..ఈ రెండూ విడి విడిగా రుచిగా ఉంటాయి. కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుంది.. టేస్ట్‌లోనే కాదు పోషక విలువలూ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ పూడ్ అని కూడా అంటారు. శనగపప్పులో ప్రొటిన్లు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు బెల్లంలో జింక్, సెలీనియం మెండుగా ఉన్నాయి. వేయించిన శనగపప్పులో బీ6, సీ, ఫోలేట్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లావిన్, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, రాగి వంటి ఇతర ఖనిజాలు ఉన్నాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, వేయించిన శనగపప్పు తినటం వల్ల జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లం, పుట్నాలు కలిపి తినటం వల్ల ప్రోటీన్, పొటాషియం, పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి
ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం, పుట్నాలు రక్తహీనతను నివారిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా, ఇది మహిళల్లో ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లం, పుట్నాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకల నొప్పిని తగ్గించి, ఎముకలను బలపరుస్తుంది. ఇది అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజూ ఉదయాన్నే బెల్లం, శనగపప్పు తింటే ఈజీగా బరువు పెరుగుతారు.
బెల్లం, శనగలు తీసుకోవడం వల్ల మెదడు పదును పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరం నుండి విష వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. బెల్లం, పుట్నాల పప్పును రోజూ తీసుకోవడం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి. శారీరక బలహీనతను దూరం చేసి శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. శరీరానికి పోషణను అందిస్తాయి, రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..