ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకు లో పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీశారు.
అనేక ప్రయత్నాలు చేశారు. భర్తను బ్రతికించుకోవడానికి.. భార్య లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి తన లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు అది సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. వీరి పవిత్రబంధం కాస్తా కాలేయ బంధంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నువ్వు దేవుడయ్యా సామీ !! రూ.కోటితో బిచ్చగాడు విందు
గర్ల్ ఫ్రెండ్ కోసం 11 వారాలు ఫ్లైట్ జర్నీ.. దేశాలే దాటేశాడుగా
ఈ ఉద్యోగం వెరీ స్పెషల్.. కండిషన్స్ అప్లై