థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్ధులు మృతి.. హాలిడే ట్రిప్‌లో ఉండగా..

2 hours ago 1

థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. బస్సులో 38 మంది విద్యార్ధులు, ఆరుగురు టీచర్లు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మిడియా వెల్లడించింది. సెంట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ ట్రిప్ కోసం అయుతయా బ్యాంకాక్‌ వస్తుండగా బస్సులో మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో థాయ్‌లాండ్‌లోని ఖు ఖోట్‌లోని జీర్ రంగ్‌సిట్ షాపింగ్ మాల్ సమీపంలోని ఫాహోన్ యోథిన్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాజధాని బ్యాంకాక్‌కు ఉత్తరాన 250 కిమీ (155 మైళ్లు) దూరంలో ఉన్న ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ ట్రిప్ ప్రారంభమైంది. ఈ యాత్రలో విద్యార్థులతో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. బస్సు వెళ్తుండగా.. ముందుగా బస్సు టైర్‌ ఒకటి పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. బస్సు మొత్తం దగ్ధమైందని అధికారులు తెలిపారు.

మృతుల సంఖ్య లేదా గాయపడిన వారి సంఖ్యను పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే.. ప్రమాదం అనంతరం 16 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని రవాణా మంత్రి సూర్య జువాంగ్రూంగ్‌కిట్ తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసినట్లు ప్రధాని పేటోంగ్‌టర్న్ షినవత్రా తెలిపారు.

เมื่อเวลา 12.27 น. ถนนวิภาวดีรังสิต ขาเข้า หน้าอนุสรณ์สถาน รถบัสเกิดเพลิงลุกไหม้ ในช่องทางหลัก เลนขวา รถติดมาก ท้ายแถวสะสมหน้าโรงพยาบาลราชวิถี 2 (รังสิต) เบื้องต้นมีเด็กนักเรียนได้รับบาดเจ็บ ความคืบหน้าจะรายงานให้ทราบต่อไป#เรื่องเล่าเช้านี้ #ข่าวช่อง3 #ข่าวสังคม pic.twitter.com/mn6BiI2siC

— เรื่องเล่าเช้านี้ (@MorningNewsTV3) October 1, 2024

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article