హ్యాపీ బర్త్‌డే టు నీతా అంబానీ. నవంబర్ 1వ తేదీన నీతా అంబానీ 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వయస్సులో కూడా ఆమె చాలా చురుగ్గా ఫిట్‌గా ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఆమె అనుమతి లేకుండా ఏ పనులు కూడా ముందుకు సాగవు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. నీతా అంబానీ వ్యక్తిగత కెరీర్‌ను పరిశీలిస్తే, ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా పని చేశారు.
అప్పుడు ఆమె వేతనం కేవలం 800 రూపాయలు. 2003లో ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ని ప్రారంభించారు. అక్కడ్నుంచి ఆమె స్వంత సామ్రాజ్య నిర్మాణం ప్రారంభమైంది. నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. ఆమె కింద రిలయన్స్ ఫౌండేషన్ , విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ వంటివి ఉన్నాయి. నీతా అంబానీని ‘ఫస్ట్ లేడీ ఆఫ్ స్పోర్ట్స్’ అని కూడా పిలుస్తారు. ఆమె IPL జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమాని. ఐపీఎల్ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఇదీ ఒకటి. ఇటీవల ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికయ్యారు. ఈ కమిటీలో చేరిన తొలి భారతీయురాలు ఆమె. భారతదేశంలో ఫుట్‌బాల్ పునరుద్ధరణకు నీతా అంబానీ కూడా కారణం. ఆమె ఇండియన్ సూపర్ లీగ్ కు వ్యవస్థాపక చైర్‌పర్సన్ కూడా. నీతా అంబానీ సామ్రాజ్యం ఇక్కడితో ఆగలేదు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు. నీతా అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకైన ముంబైలోని ‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ కూడా ఆమె సామ్రాజ్యంలో ఒక భాగం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు దొరికిన ప్లాస్టిక్ కవర్.. అందులోఉన్నది చూసి షాక్ !!
Vettaiyan OTT: ఓటీటీలోకి వేట్టయాన్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే !!