నాంపల్లిలోని నుమాయిష్‌లో రేంజర్ రైడ్ మొరాయించి జనాలను షాక్‌కు గురిచేసింది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రైడ్ ఆగిపోవడంతో అందులో ఉన్న జనాలకు ఊపిరి ఆగినంత పనైంది. రన్నింగ్‌లో ఉండగానే రేంజర్ రైడ్ ఉన్నపళంగా నిలిచిపోయింది. ప్రయాణికులు దాదాపు 15 నిమిషాలు అలా గాల్లో తలక్రిందులుగా ఉండిపోయారు.
దీంతో వారికి చెమటలు పట్టేశాయి. ప్రాణాలతో సేఫ్‌గా బయటపడుతామా అని వారంతా హడలిపోయారు. బేరింగ్‌లు మరమ్మతుకు రావడంతోనే రేంజర్ నిలిచిపోయిందంటున్నారు. నిర్వాహకులు, పోలీసులు అందులో ఉన్న వారిని సురక్షితంగా కిందకు దించారు. లక్కీగా అంతా సేఫ్‌గానే బయటపడ్డారు. ప్రతీ రోజు నుమాయిష్‌ను కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. ఎగ్జిబిషన్‌లో ఉండే ఇలాంటివి ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఘటనతో జాలీ రైడ్స్ ఫిట్‌నెస్‌పైన, సేఫ్టీపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరదా సరే.. తేడా వస్తే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయ్.. అందుకే సేఫ్టీపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.