మన దేశంలో పాములను దేవతా రూపాల్లా పూజిస్తారు. కొందరు పాములు హాని చేస్తాయని భయపడతారు. అవే పాములు రైతుల పాలిట వరంగా భావిస్తారు. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా చేస్తూ.. పంటపొలాలకు రక్షగా నిలిచేవి పాములే. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3 వేల రకాల పాములు ఉన్నాయని సైన్స్ చెప్తోంది. పాములు దాదాపు ఎలాంటి వాతావరణంలోనైనా ఇమడగలవు. అందుకే అభయారణ్యాలతో పాటు ఎడారుల్లోనూ పాములు కనిపిస్తాయి. కానీ, ప్రపంచంలో అసలు పాములే లేని దేశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూసేయండి..
అంటార్కిటికా..
అంటార్కిటికాలో పాముల జాడే కనపడదు. ఎందుకంటే ఇక్కడి ప్రతికూల వాతావరణం పాముల మనుగడకు ఏమాత్రం అనుకూలించదు. ఇక్కడ ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండటం వల్ల పాములు జీవించలేవట. సరీసృపాలు అతి చల్లదన్నాన్ని భరించలేవు. పాములు మాత్రమే కాదు అంటార్కిటికాలో పెంగ్విన్స్, సీల్స్ వంటివి కూడా కనపడవట.
న్యూజిలాండ్..
పాములే లేని దేశంగా ఇప్పటికే న్యూజిలాండ్ ప్రకటించుకుంది. ఇదొక ద్వీపదేశం. చుట్టూ సముద్రం ఉండటం వల్ల పాములు వాటిని దాటుకుని రాలేవు. కానీ, ఈ దేశం భూభాగం చుట్టూ పాములు ఉంటాయి. ఒక్క న్యూజిలాండ్ భూభాగంలో మాత్రం ఇవి వకనిపించవు. అంతేకాదు అక్కడి జంతు ప్రదర్శన శాలల్లో కూడా వీటిని చూడలేము. ఎవరైనా విదేశాల నుంచి పాములను తీసుకువచ్చినా అది నిషేధమే. తమ దేశం పాములకు అనువైనది కాదని న్యూజిలాండ్ చెప్తోంది. మరోవైపు, స్థానిక జీవజాతులను పాముల నుంచి రక్షించేందుకు న్యూజిలాండ్ కఠినమైన నియమనిబంధనలు రూపొందించింది. టూరిస్టులు, లేదా న్యూజిలాండ్ పౌరులు స్వదేశానికి తిరిగొస్తున్నప్పుడు తమ వెంట బయటిదేశాల్లోని పాములు తీసుకురాకూడదనే నిబంధనల అమలు చేస్తోంది. అక్కడి జంతుప్రదర్శనశాలల్లో కూడా పాములు ఉండవు. అయితే, ఇతర సరీసృపాలు మాత్రం అక్కడ భారీ సంఖ్యలోనే ఉన్నాయి.
ఐర్లాండ్…
ఐర్లాండ్ లోనూ పాములు కనిపించవు. ఎందుకంటే ఇక్కడి భౌగోళిక, ప్రాపంచిక పరిస్థితులు కూడా వాటికి అనుకూలించకపోవడమే. పాములు కాస్త ఉష్ణ వాతావరణాన్ని కోరుకుంటాయి. గ్రీన్లాండ్, ఫసిఫిక్ ఐలాండ్స్, కేప్ వెర్డ్, కుక్ అలస్కా లోనూ పాములు ఉండవు. ఒక్క బ్రెజిల్ లో మాత్రమే ఎక్కడా లేనన్ని పాముల రకాలుంటాయి. ఏకంగా 400 రకాల పాము జాతులను బ్రెజిల్ లో చూడొచ్చు.