ప్రపంచవ్యాప్తంగా ఉప్పు పెద్ద సమస్యగా మారింది. సాల్ట్ లేకుండా వంటలు తినలేం. అలా అని సాల్ట్ ఎక్కువగా తింటే వచ్చే జబ్బుల సంఖ్య చాలా ఎక్కువే..! ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం మన శరీరంపై చూపించే ప్రభావం ప్రాణాల మీదకు తీసుకొస్తుందంటున్నారు వైద్య నిపుణులు. దానికి తోడు కొత్తగా మార్కెట్లోకి రకరకాల పేర్లతో కంపెనీలు సాల్ట్ ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి. ఇలాంటి వాటితో ప్రాణాలకే ముప్పు వాటిల్లింతుందంటున్నారు డాక్టర్లు.
రోజు ఐదు గ్రాముల వరకు ఉప్పు తినడం మేలు.. కానీ భారతదేశంలో ఇక్కడి స్టైల్ వంటకాల్లో కనీసం ఒక్కో మనిషి ఎనిమిది నుంచి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. దీనివల్లే ముందుగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కడుపులో క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఒబెసిటీ, మహిళలకు అయితే అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీపీ రాగానే డాక్టర్ మొదటి చెప్పే మాట ఉప్పు తగ్గించమని..! కానీ ఉప్పు లేకుండా తినడం చాలామంది అలవాటు చేసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉప్పు లేకుండా తినడం అనే విషయాన్ని మర్చిపోతారు. అవసరమైతే ఇంకొన్ని మందు గోలీలు వేసుకుంటాం.. కానీ ఉప్పు లేకుండా తినలేము అనే స్థాయికి వచ్చేస్తున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బీపీ పేషెంట్ల సంఖ్యకు అసలు కారణం సాల్ట్. అయితే ఈ సాల్ట్ కు విరుగుడు కనిపెట్టింది ఒక జపాన్ కంపెనీ. లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ కొత్త రకం స్పూన్ విడుదల చేశారు. ప్రతి ఏడాది కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది. అది సి ఈ ఎస్.
కిరిన్ అనే జపాన్ కంపెనీ ఈ టెస్ట్ బర్డ్స్ స్పూన్ని తయారుచేసింది. వీక్ ఎలక్ట్రిక్ వేవ్స్ ద్వారా ఈ స్పూన్ మన నాలుకకు మనం తినే ఆహారంలో ఉప్పు ఉన్నట్లుగా ఒక భావనను కల్పిస్తుంది. అసలు ఉప్పు వేయని వంటకాలు తిన్న, చివరికి చక్కెరను తిన్న మనం ఉప్పుతో కూడిన రుచికరమైన వంటకాన్ని తిన్న సంతృప్తి కలిగిస్తుంది. టెక్నికల్ గా నాలుకపై చిన్న చిన్న అతి సున్నితమైన నరాలు ఉంటాయి. వాటిని సూక్ష్మస్థాయిలో ఎలక్ట్రిక్ తరంగాలకు గురి చేయడం ద్వారా ఉప్పు రుచి నాలుకకు తగులుతుంది. ఇలా ఆహారంలో ఉప్పు లేకున్నా, ఉప్పు రుచితో తిన్నామన్న అనుభూతిని కలిగిస్తుంది.
సైన్స్ ను ఉపయోగించి ఈ టెస్ట్ బర్డ్ స్పూన్ ని తయారు చేసింది ఈ జపాన్ కంపెనీ. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో నాలుగు రకాల సెట్టింగ్లు ఉంటాయి. మన అభిరుచికి తగ్గట్లుగా ఎంత ఉప్పు తినాలనుకుంటే ఆ సెట్టింగ్ లో పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రమాదం లేదని జపాన్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా దీన్ని సర్టిఫై చేశారు. అంతేకాదు ఇది ఉపయోగించడం వల్ల ఉప్పు లేకుండా వంటలు తిని ఆరోగ్యంగా కూడా తయారవ్వచ్చు. ఇండియా మార్కెట్లో ఇంకా రిలీజ్ అవ్వడానికి రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ జపాన్ అమెరికా మార్కెట్లో వచ్చేనెల రిలీజ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతుంది. అయితే ఈ టెస్ట్ బర్డ్స్ స్పూన్ ధర ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలు. ధర కాస్త ఎక్కువైనా ఉపయోగాలు మాత్రం చాలా ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)