Updated on: Feb 08, 2025 | 3:00 PM
పాలిటిక్స్‌కు దూరంగా ఉండే అక్కినేని నాగార్జున హస్తినలో వాలిపోయారు. ఏకంగా ఫ్యామిలీతో సహా పార్లమెంటుకు వెళ్లారు. ప్రధాని మోదీతో అక్కినేని ఫ్యామిలీ భేటీ అయింది. ఈ అంశమే ఇప్పుడు ఇటు టాలీవుడ్, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ నాగార్జున పార్లమెంటుకు ఎందుకు వెళ్లినట్టు? అక్కడ ఎవరిని కలిశారు? ఏం చర్చించారు? ప్రధానితో భేటీ కావడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది?
ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ కలుసుకుంది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత పార్లమెంటులో ప్రధానిని కలుసుకున్నారు. హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశారు. తాజా భేటీ ఎందుకోసమనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా మోదీతో నాగార్జున ఫ్యామిలీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రాఫీ లాంఛ్ గురించి ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ