ఐవిఎఫ్ సెంటర్ ద్వారా పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ముగ్గురు మహిళలకు విజయవంతమైనట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రజిని రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు. ఆస్పత్రిలోని సంతాన సౌఫల్య కేంద్రం ఐ వి ఎఫ్ సెంటర్ కు 20 మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో శంషాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లు ఆమె వివరించారు. సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వాసుపత్రిలో సంతాన సౌఫల్య కేంద్రం ఐవిఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ విజయం వెనుక ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ అమృతలక్ష్మి మరియు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చూశారా ??
నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు
H-1B Visa: అమెరికన్ ఉద్యోగులకు H1B ముప్పు