ప్రేమికుల దినోత్సవం వచ్చేస్తోంది. ఈరోజు తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి యువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా వారికి గులాబీలను బహుమతిగా ఇస్తూ తమ ప్రేమను తెలియబరుస్తుంటారు. అయితే ప్రతి వాలెంటైన్ డేకి గులాబీలే ఏం బాగుంటాయి చెప్పండి. అందుకే ఇప్పుడు కాస్త కొత్తగా ట్రై చేద్దాం. గులాబీలే కాకుండా మీ ప్రేమను మరింత దృఢంగా మార్చుకోవడానికి ఈ ఫ్లవర్స్ కూడా ఇవ్వవచ్చునంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Feb 11, 2025 | 2:04 PM
లిల్లీలు లిల్లీలు అంటే చాలా మంది అమ్మాయిలు తెగ ఇష్టపడుతుంటారు. మంచి సువాసనతో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. అంతే కాకుండా ఈ పూలు స్వచ్ఛత, నిబద్దతకు ప్రతిరూపం, పింక్ లిల్లీలు ప్రేమను తెలిపితే, తెలుపు లిల్లీలు స్వచ్ఛతను తెలియజేస్తాయి. కాబట్టి మీ ప్రియురాలికి ఈ పూలు ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చునంట.
1 / 5
తులిప్స్ తులిప్స్ పూలను ఇష్టపడని వారే ఉండరు. ఈ పూలను మీ ప్రియురాలికి బహుమతిగా ఇస్తే ఆమె ఆనందం మాటల్లో చెప్పలేం. అంతేకాకుండా ఈ రంగు రంగుల తులిప్స్ మీలోని ఉద్వేగభరితమైన ప్రేమను సూచిస్తాయంట. అందువలన ఈ పూలను మీ లవర్‌కు ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు.
2 / 5
ఆర్కిడ్లు ఈ పూలు మీ ప్రమే, అప్యాయతకు చిహ్నం అంటుంటారు. అందువలన గులాబీలను కాకుండా ఈ పూలను మీ ప్రియురాలికి ఇస్తే ఆమె చాలా సంతోషపడుతుంది.
3 / 5
పియోనీలు ఈ పూలు మంచి సువాసనను వెదజల్లుతాయి. అంతే కాకుండా, వీటిని రొమాన్స్‌కి సింబాలిక్ పూలని కూడా అంటారు. అందువలన ఈ పూలను మీ లవర్‌కు ఇచ్చి మీకు ఆమెపై ఉన్న ప్రేమను తెలియజేయవచ్చు.
4 / 5
సూర్యకాంతాలు ఈ పూలు చాడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని మీ ప్రియురాలికి బహుమతిగా ఇస్తే ఆమె చాలా సంతోషపడటమే కాకుండా మీపై మరింత ప్రేమను పెంచుకుంటుంది.
5 / 5