డెలీవరి తరువాత మహిళలకు మంచి పౌషికాహారం అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, గుడ్లు,పాలు,చేపలు వంటివి తప్పనిసరిగా అందించాలని సూచిస్తున్నారు. అయితే, బాలింతలకు పెట్టే ఆహారంలో బంక లడ్డూలను కూడా చేర్చుకోవటం వల్ల మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. ఈ లడ్డూల తయారీకి ప్రత్యేకించి బంక దీనినే గోండ్ కటిరా, గోంద్ కతీరా అని పిలుస్తారు.. ఇది లడ్డూలకు ప్రత్యేక రుచిని అందిస్తుంది. డెలివరీ తర్వాత బాలింతలకు ఎంతో బలవర్ధకం అంటున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఇలాంటి లడ్డూలను తినిపిస్తుంటారు చాలా మంది పెద్దలు. ఇంతకీ ఈ గోండ్ కటిరా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గోంద్ కటిరా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక మినరల్స్‌తో పాటు విటమిన్లు కూడా ఉంటాయి. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే, ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. కణజాలాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి.
వేసవిలో అరికాళ్లు, కాళ్ల మంట సమస్య ఉన్నవారు గోండు కటిరను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. గోండ్ కటీరా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి చర్మం పొడిబారడం, దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. గోండ్ కటిరా కూడా చాలా వరకు ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.