వాడిపోయిన బెండకాయలను 10 నిమిషాలలో తిరిగి తాజాగా మార్చుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఒక పాత్రలో 3-4 ఐస్ క్యూబ్స్ వేసి, వాటితో పాటు వాడిపోయిన బెండకాయలను పెట్టి, వాటిపై చల్లటి నీటిని పోసి 10 నిమిషాలు ఉంచాలి. ఈ పద్ధతి ద్వారా బెండకాయలు తిరిగి తాజాగా మారిపోతాయి. మార్కెట్ నుండి తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి.
Ladies Finger
బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలైన కూరగాయలలో ఒకటి. ఇది విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. కానీ బెండకాయను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వండకపోతే వాడిపోతుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉంచినా 2-3 రోజుల్లోపే వండేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే బెండకాయ పండిపోయి ఉపయోగించడానికి పనికిరాకుంట అయిపోతుంది. అయితే మీరు ఈ సమస్యకు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడిపోయిన బెండకాయలను మళ్లీ తాజాగా మార్చుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
10 నిమిషాల్లో తాజాగా బెండకాయలు
మీ దగ్గర వాడిపోయిన బెండకాయలు ఉంటే వాటిని పక్కన పెట్టి ముందుగా మీ ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్స్ తీసుకోండి. మీరు 3-4 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఆ పాత్రలో ఈ ఐస్ క్యూబ్స్ వేసి వాటితో పాటు వాడిపోయిన బెండకాయలను కూడా వేసుకోండి. తర్వాత బెండకాయలు పూర్తిగా మునిగేలా ఆ పాత్రలో చల్లని నీటిని పోయండి. అలాగే బెండకాయలను ఒక 10 నిమిషాలపాటు ఉంచండి. ఈ 10 నిమిషాల తరువాత మీరు చూస్తే.. వాడిపోయిన బెండకాయలు తిరిగి తాజాగా మారిపోతాయి. మార్కెట్ నుంచి కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఎలా ఫ్రెష్ గా కనిపించాయో అచ్చం అలాగే ఉంటాయి.
ఈ ట్రిక్ ప్రయోజనాలు
మనలో చాలా మంది వాడిపోయిన తర్వాత బాగా లేవని పాడేస్తుంటాం. పై ట్రిక్ ఫాలో అవ్వండి రిజల్ట్ తప్పకుంట ఉంటుంది. కూరగాయలను వృథా చేయకుండా ఉపయోగించడం కోసమే ఈ చిన్న చిట్కా. మీ ఇంట్లో ఈ సింపుల్ ట్రిక్‌ని ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ ట్రిక్ మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది, వృథాను తగ్గిస్తుంది.