నిజానికి ఆరోగ్యానికి రెండూ మంచివే అంటున్నారు నిపుణులు. కానీ, నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడటంలో కీలక పాత్ర వహిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి నల్ల ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ గా పిలిచే వాపు ప్రక్రియను అడ్డుకుంటుంది. దీంతో గుండె జబ్బులే కాకుండా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు నుంచి కాపాడుతుంది.
క్యాన్సర్ పరార్..
నల్ల ద్రాక్షలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం స్థాయిలు లోబీపీని తగ్గిస్తాయి. అలాగే ఇందులో అధికమొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యాన్ని పదిలపరచడంలో సాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫెనల్స్ వంటివి క్యాన్సర్ రిస్కును తగ్గించేవిగా గుర్తించారు. ముఖ్యంగా కాలన్, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ ను తగ్గించడంలో సాయపడతాయి.
మతిమరుపు దరిచేరదు..
వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి వ్యాధులను ఇవి దూరంగా ఉంచుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ కీలక పాత్ర వహిస్తాయి. బ్లాక్ గ్రేప్స్ లో డైటరీ ఫైబర్లు అధికంగా ఉంటాయి ఇవి మలబద్దకాన్ని తగ్గించడంలో సాయపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచుతాయి.
ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే..
విటమిన్ సి అధికంగా ఉండే పళ్లలో నల్ల ద్రాక్ష కూడా ఒకటి. ఇవి ఇమ్యూన్ సిస్టంను బూస్ట్ చేస్తాయి. సహజంగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఎంత వయసొచ్చినా యవ్వనంగా కనిపించాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇందులో ఉండే ప్రత్యేకమైన గణాలు చర్మంపై వచ్చే ముడతలను, మచ్చలను రాకుండా చేస్తాయి. చర్మం పొరను డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి.
అందుకే ధరల్లో తేడాలు..
ఆకుపచ్చ ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. దాంతో పాటు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎవరైతే బరువును అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఇవి బాగా పనిచేస్తాయి. వీటినే ఎండబెట్టి కిస్ మిస్ గా విక్రయిస్తుంటారు. విటమిన్ సికి ఇవి మంచి సోర్స్ గా చెప్పొచ్చు. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా చేస్తాయి. అందుకే ఉపవాస దీక్షల్లోనూ పచ్చ ద్రాక్షను ఎక్కువగా తీసుకుంటారు. మరి వీటితో పోలిస్తే నల్ల ద్రాక్షల్లో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎక్కువగా తింటే అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని రకాల ఆరోగ్యసమస్యలను దూరం చేయడంలో నల్ల ద్రాక్షకు కాస్త ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ పండ్ల పెంపకం, నిర్వహణ, సేకరణ వంటివి రిస్క్ తో కూడుకున్నవి కావడంతో ధర కూడా ఎక్కువగా ఉంటుంది.