కొలరాడోలోని ఆస్పెన్‌లో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో డిసెంబరు 25న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో వీరు నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో 2.5 మిలియన్ డాలర్ల గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి బెజోస్ ఆమెకు ప్రపోజ్ చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. 54 ఏళ్ల లారెన్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్, లారెన్ 2018 నుంచే డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అయితే, 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్ , బెజోస్.. తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, లారెన్‌కు గతంలో పాట్రిక్ వైట్సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మహేశ్, ప్రభాస్‌లని దాటేసిన బన్నీ! | నయన్ – ధనుష్ వివాదం మధ్యలో మహేష్ పోస్ట్
Mahesh Babu: మెన్స్ డే రోజు.. నిజమైన మగాడంటే ఎవరో చెప్పిన మహేశ్ బాబు
Ram Charan: ఆ స్టార్‌కు ఇచ్చిన మాట కోసమే కడప దర్గాకు వచ్చా..
భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్” ప్రారంభానికి ట్రంప్ జూనియర్