ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయించారు. కాస్టాయిక్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్చిచ్చు మొదలైన ప్రాంతం.. ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్, పాలిసేడ్స్‌కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతాల్లో మంటలు ఇంకా ఆరలేదు. దీనికి తోడు, దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. గాలి బలంగా వీస్తుండటంతో మంటలు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రికార్డు స్థాయిలో మంత్రాలయం హుండీ ఆదాయం
ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం
ధనుష్ అలా మాట్లాడేసరికి షాకయ్యా
రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్! ఈ హిట్ సినిమా OTTలో…
Prabhas: వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న డార్లింగ్.. మళ్లీ మారిన ప్రభాస్ లైనప్