మాల్దీవులు దివాలా? స్వరం మార్చి కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు.. భారత్ విషయంలో అలా ఎప్పటికీ జరగదంటూ..

2 hours ago 1

భారత్ అవుట్ అన్న నినాదంతో మాల్దీవులలో అధికారం చేపట్టిన మొహమ్మద్‌ ముయిజ్జు.. తర్వాత చైనాకు దగ్గరగా భారత్ దూరంగా జరుగుతూ వచ్చారు. హిందూ మహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు.. చైనాతో సంబంధాలను పెంచుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపధ్యంలో మన దేశంలో అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు అడుగు పెట్టారు. భారత్‌లో తొలిసారి ద్వైపాక్షిక పర్యటన కోసం ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ కూడా ఉన్నారు. అయితే ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.. కాగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ముయిజ్జు అతిధిగా హాజరయ్యారు.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న తర్వాత అతని స్వరం మారినట్లుంది. చైనాకు మద్దతిచ్చే ముయిజ్జు భారత్ పట్ల తన విధేయతను ప్రదర్శించి చైనాకు సందేశం ఇచ్చాడు. భారతదేశ భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎప్పటికీ చేయదని ఆయన స్పష్టం చేశారు.

మాల్దీవులు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు.. అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌తో తన సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకే చైనాను పొగిడినా భారత్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ దేశం నుంచి భారత సైనికులు తిరిగి వెళ్ళిపోవాలని మాల్దీవులు కోరింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

భారత భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎన్నటికీ

చైనాతో మాల్దీవుల సంబంధాల వల్ల భారత్ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని అధ్యక్షుడు ముయిజ్జు ఆదివారం స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ‘భారత భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎన్నటికీ చేయదు. భారతదేశం మాల్దీవులకు విలువైన భాగస్వామి, స్నేహితుడు. తమ సంబంధాలు పరస్పర గౌరవం , ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. తాను అన్ని రంగాలలో ఇతర దేశాలతో తన సహకారాన్ని మెరుగుపరురుచుకుంటానని.. తన చర్యలు తమ ప్రాంతం భద్రత , స్థిరత్వానికి రాజీ పడకుండా చూసుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.

భారత దళాల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి ఎదురైన ప్రశ్నకు ముయిజ్జు బదులు ఇస్తూ దానిని దేశీయ ప్రాధాన్యతగా పరిగణించాలని అన్నారు. మాల్దీవులు, భారతదేశం ఇప్పుడు ఒకరి ప్రాధాన్యతలు ఒకరు, ఒకరి ఆందోళనలను ఒకరు బాగా అర్థం చేసుకున్నాయని చెప్పారు. మాల్దీవుల ప్రజలు ఏం చేయమని కోరారో అదే చేశాను. ఇటీవలి మార్పులు దేశానికి మొదటి స్థానం అనేది తమ విధానమని, భారత్‌తో దీర్ఘకాల, విశ్వసనీయ సంబంధానికి విలువ ఇస్తూనే ఉంటామని చెప్పారు. ఇతర దేశాలతో మా సంబంధాలు భారతదేశ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయవని తాను విశ్వసిస్తున్నట్లు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తామని మయిజ్జు అన్నారు.

మాల్దీవులు దివాలా?

భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని.. తన పర్యటనతో రెండు దేశాల బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అప్పు తీర్చలేక మాల్దీవులు దివాళా తీసే దశకు చేరుకుంది. ప్రస్తుతం మాల్దీవుల విదేశీ మారక నిల్వలు 440 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముయిజ్జు అధ్వర్యంలో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం “ఇండియా అవుట్” ప్రచార పతాకాన్ని ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన.. మాల్దీవుల్లో విదేశీ దళాలు ఉండడంతో తనకు ఇబ్బంది ఉందని.. అయితే తాను ఏ దేశానికి వ్యతిరేకం కాదని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article