మీరు మారరా..! మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీ.. బన్నీ వాసు సీరియస్ వార్నింగ్

3 hours ago 2

నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది ఈ సినిమా. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమాకు అనికొని అడ్డంకులు ఎదురవుతున్నాయి. తండేల్ సినిమా ను పైరసీ భూతం వెంటాడుతుంది. ఈ మధ్య కొత్త సినిమాలు పలు వెబ్ సైట్స్ లో వెంటనే పైరసీ వర్షన్ లో దర్శనమిస్తున్నాయి. అలాగే తండేల్ సినిమా కూడా పైరసీ బారిన పడింది.

ఇటీవలే ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించారు. దాంతో చిత్ర నిర్మాత బన్నీ వాసు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలువురి పై కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడం షాక్ కు గురిచేసింది. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు బన్నీ వాసు. ఈ మేరకు ఆయన సినిమా టికెట్ తో సోషల్ మీడియాలో  పోస్ట్ షేర్ చేశారు.

మా సినిమా పైరసీని మరోసారి ప్రదర్శించారు. దీనివల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. ఇది ఎంతోమంది క్రియేటర్స్‌ శ్రమను అగౌరవపరచడమే అని బన్నీ వాసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆర్టీసీ బస్సులో సినిమా వేయడంతో వాసు మాట్లాడుతూ.. కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం అని బన్నీ వాసు అన్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాద్యుల పై చర్యలు తీసుకుంటామాని ఆయన తెలిపారు.

Once again the pirated mentation of our #Thandel played connected the @apsrtc autobus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the movie manufacture and disrespects creators’ hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly guarantee a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP

— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article