అనకాపల్లి జిల్లాలో భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. టేకు తోటల్లో నుంచి.. ఓ ఇంటి వాష్ రూమ్‌లో చొరబడింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయారు ఆ ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడిపల్లిలో.. 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. టేకు తోట పక్కనే ఉన్న ఓ ఇంటి వాష్ రూమ్‌లో వెళ్లి నక్కింది గిరి నాగు. ఆహారం వెతుక్కుంటూ.. వాష్ రూమ్‌లో దూరింది 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా. అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది.
వాష్ రూమ్‌లో నుంచి వింత శబ్దం వస్తుండడంతో ఇంట్లో నివసిస్తున్న కుటుంబం తొంగి చూసేసరికి.. భారీ గిరినాగు కనిపించింది. భయభ్రాంతులకు గురై స్థానికులు, స్నేక్ క్యాచర్, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సభ్యులు.. గంట పాటు శ్రమించారు. అయితే ఒకానొక సమయంలో.. గిరినాగును బంధించే క్రమంలో ఎదురు తిరిగింది.. ఆ భారీ కింగ్ కోబ్రా. గిరి నాగులను పట్టుకోవడంలో నేర్పరి కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎట్టకేలకు ఆ 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి