India vs England, 3rd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. 26 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు రెండు వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (87), శ్రేయాస్ అయ్యర్ (23) క్రీజులో ఉన్నారు. కోహ్లీ (52), రోహిత్ (1) పెవిలియన్ చేరారు.
Updated on: Feb 12, 2025 | 3:24 PM
Virat Kohli: బుధవారం అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ బ్రిటీష్ జట్టుపై అంర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరడంలో క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ, ఆచి తూచి ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
1 / 5
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తన 87వ మ్యాచ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌పై అతను 8 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో 41.23 సగటుతో పరుగులు రాబట్టాడు.
2 / 5
ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లాండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5028 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుత ఆటగాళ్లలో, స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేశాడు. ఈ ఆస్ట్రేలియన్ సీనియర్ బ్యాట్స్‌మన్ 4815 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
3 / 5
ఇంగ్లాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎవరున్నారో ఓసారి చూద్దాం: 1. డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) - 63 ఇన్నింగ్స్‌లలో 5028, 2. అలన్ బోర్డర్ (AUS) - 124 ఇన్నింగ్స్‌లలో 4850, 3. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 114 ఇన్నింగ్స్‌లలో 4815
4 / 5
ఇంగ్లాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎవరున్నారో ఓసారి చూద్దాం: 4. వివియన్ రిచర్డ్స్ (WI) - 84 ఇన్నింగ్స్‌లలో 4488, 5. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 99 ఇన్నింగ్స్‌లలో 4141, 6. విరాట్ కోహ్లీ (IND) - 109 ఇన్నింగ్స్‌లలో 4001*
5 / 5