ఐవీఆర్ అనేది బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌లు ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. దీనిలో, మీరు మీ ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా “ఇంగ్లిష్ కోసం 1 నొక్కండి” లేదా “బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి 2 నొక్కండి, కస్టమర్ కేర్‌తో మాట్లాడటానికి 3 నొక్కండి, 9 నొక్కండి” వంటి ఆదేశాలను ఇవ్వడం ద్వారా మీ సేవను ఎంచుకోవచ్చు. స్కామర్లు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా వారు పేర్కొన్న కీని నొక్కినప్పుడు, వారు అతని ఖాతాను ఖాళీ చేస్తారు. ఐవీఆర్ కాల్స్ ద్వారా, స్కామర్లు ఎవరికైనా కాల్ చేసి బ్యాంకు నుంచి ఫోన్ చేసినట్లు చేస్తారు.
ఇటీవల బెంగళూరులోని ఒక మహిళకు జనవరి 20న ఎస్‌బీఐ పేరుతో ఉన్న కాలర్ ఐడీ నుంచి చూపిస్తూ ఓ కాల్ వచ్చింది. బాధితురాలి ఖాతా కూడా ఎస్‌బీఐలో ఉండడంతో ఆ కాల్‌ను ఆమె ఎత్తింది. అయితే ఆమె ఖాతా నుంచి రూ. 2 లక్షలు బదిలీ అవుతున్నాయని, ఈ లావాదేవీని ఆపాలనుకుంటే ఐవీఆర్ మెనూలోను ఆప్షన్లను ఎంచుకోవాలని ఆ కాల్‌లో వాయిస్ వినిపించిది. ఆ మహిళ ఆ సూచనలను పాటించడంతో కాల్ ముగిసిన వెంటనే ఆమె ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయ్యినట్లు మెసేజ్ వచ్చింది. కాలర్ ఐడీ స్పూఫింగ్, స్కామర్లు కాల్ చేసే నంబర్ బ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థకు సంబంధించిన నిజమైన నంబర్ లాగా కనిపిస్తుంది. వాయిస్ క్లోనింగ్, కాల్స్ అసలు ఐవీఆర్‌లా వినిపించేలా కేటుగాళ్లు కొత్త టెక్నిక్‌తో ప్రజల నుంచి సొమ్మును కొట్టేస్తున్నారు.
అయితే మీకు వచ్చిన ఐవీఆర్ కాల్ నకిలీదా? లేదా నిజమా? అని ఎలా గుర్తించాలి. ఒక కాలర్ ఓటీపీ లేదా సీవీవీ అడిగితే అది నకిలీ ఫోన్ అని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు ఫోన్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ సీవీవీ అడగరు. అలాగే అవతలి వ్యక్తి చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీపై ఒత్తిడి తెస్తుంటే అది కూడా నకిలీ కాల్ అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి