ప్లాస్టిక్... ప్లాస్టిక్...ప్లాస్టిక్ ! మన జీవితంలో ఇది అంతర్భాగం అయిపోయింది. వాటర్ బాటిల్ మొదలుకొని... వంటింట్లో వాడే పోపుల పెట్టె వరకు అన్నింటికి ప్లాస్టిక్‌తోనే పని ! అది లేకుండా ఏ పనీ కాదు ! అడుగు ముందుకు పడదు !! ఇప్పుడదే ప్లాస్టిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ప్రపంచానికే సవాల్ విసురుతోంది.
శతాబ్దాల కాలంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్నితీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇక మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ ఆహార రూపంలో మన శరీరంలోకి చేరిపోతోంది. భూమిని మొత్తం ఆక్రమించేసిన మైక్రోప్లాస్టిక్స్ మేఘాల్లోకీ చేరాయని, ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తుండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశంలో మైక్రోప్లాస్టిక్‌లు మంచు కేంద్రక రేణువులుగా పనిచేసి అసహజంగా మేఘాల ఏర్పాటుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మేఘాలు ఏర్పడే పరిస్థితులు లేకపోయినా మైక్రోప్లాస్టిక్‌లు మేఘాలు ఏర్పడేలా చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం పరిశోధకులు నాలుగు రకాల మైక్రోప్లాస్టిక్‌లను ప్రయోగశాలలో పరీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..