పెళ్లి సందర్భంగా మేనమామలు పెట్టే కానుకలను ప్రత్యేకంగా భావిస్తారు. కానీ కోట్ల రూపాయల కట్నాలు పెట్టే మేనమామలు ఉంటారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. రాజస్థాన్‌లో ఓ యువతి పెళ్లి సందర్భంగా ఆమె మేనమామలు ఏకంగా 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన కానుకలు పెట్టారు. ఆ యువతి, యువతి తల్లిదండ్రులు, పెళ్లికొచ్చిన బంధువులు ఇదంతా చూసి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. ఈ వీడియో పాతదే అయినా.. తాజాగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరోమారు వీడియో ప్రస్తుత్తం నెట్టింట వైరలవుతోంది.
అసల విషయం ఏంటంటే.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా బుర్ది గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు కలిసి తమ మేనకోడలు సోదరి కూతురి వివాహానికి రూ. 3.21 కోట్ల కట్నం ఇచ్చారు. 10 ఎకరాల భూమి, 30 లక్షల విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, 3 కేజీల వెండి, కొత్త ట్రాక్టర్, ట్రాలీ నిండా ధాన్యంతో పాటు ఒక స్కూటీ ని కూడా కట్నం కింద ఇచ్చారు. వీటితో పాటు రూ. 80 లక్షల నగదు కూడా అప్పజేప్పారు. అంతే కాదు.. మేనకోడలి గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక వెండి నాణెం ఇచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే, ఇలా చేయడం వారి ఆచారంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
फिर मायरा दहेज से अलग कैसे हुआ ? बस देने का तरीका ही अलग दिख रहा है.#Nagaur pic.twitter.com/gzVhmA9onG
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) March 16, 2023
నాగౌర్ జిల్లాలోని మైరా తెగకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.. అయితే మేనకోడలి, మేనకోడలు పెళ్లి అయితే కచ్చితంగా మేనమామలు వారి తెగ సంప్రదాయం ప్రకారం.. కట్నకానుకలు సమర్పించాల్సిందేనట.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..