ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు.. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు అక్కడ ఉన్న ఓ బ్యాగ్‌ను చెక్ చేశారు. ఇంకేముంది గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ జరిగిపోతోంది. కేటుగాళ్ల అక్రమ దందాను డాగ్ బయటపెట్టింది. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తదుపరి చర్యల కోసం రైల్వే పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో గంజాయిని గుర్తించిన నార్కో టిక్ స్నిఫర్ డాగ్ సీజర్‌ను.. డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్‌ను అభినందించారు సిపి బాగ్చి. ఈ మధ్యకాలంలో సీజర్ రైల్వేస్టేషన్లో గంజాయిని పట్టుకోవడం ఇది రెండోసారి. రైల్వే స్టేషన్ లో 30 కిలోల గంజాయి గుర్తించిన నార్కోటిక్ డాగ్ సీజర్.. హోం మంత్రి నుంచి ప్రశంసలు అందుకుంది. ఎక్స్ వేదికగా డాగ్ సీజర్‌తో పాటు పోలీస్ టీంను అభినందించారు హోంమంత్రి అనిత. గంజాయిని కంట్రోల్ చేసేందుకు సీపీ చేపడుతున్న కార్యకలాపాలను హోం మంత్రి ప్రశంసించారు. ‘మాదకద్రవ్యాల నిర్వీర్యం లక్ష్యంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ చేస్తున్న కృషికి అభినందనలు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో నాలుగవ పట్టణ పోలీస్‌లు, డాగ్ హ్యాండ్లర్ రామ్ ప్రసాద్, నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహకారంతో 30కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా అధికార యంత్రాంగం సహకారంంతో త్వరలో అందుబాటులోకి రాబోయే మరో 8 స్నిఫర్ డాగ్స్ ద్వారా గంజాయి ప్రక్షాళనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుతున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు హోం మంత్రి అనిత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!
TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..
బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ బిహార్‌లో..