సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !!

2 hours ago 1

సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !!

|

Updated on: Oct 22, 2024 | 12:45 PM

టాలీవుడ్‌ యంగ్ హీరో, కేరింత ఫేమ్ విశ్వంత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ శుభవార్తను అతనే తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ 'ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్' అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్- భావనల నిశ్చితార్థం జరిగింది.

అయితే ఎలాంటి హడావుడి లేకుండా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్. ఇక ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సామర్ల కోటకు చెందిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమా లో విశ్వంత్ కు ఆఫర్ వచ్చింది. దీంతో ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కేరింత సినిమా సూపర్ హిట్ కావడం, విశ్వంత్ నటనకు మంచి పేరు రావడంతో ఈ నటుడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్‌ కంటిన్యూ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్‌ భారీగానే గుంజాడుగా

Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..

బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్‌ షేక్ అవడం పక్కా.. అంతే

శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article