నిత్యం ఎక్కడో ఓ చోట ఈ సైబర్ నేరాల గురించి వింటూనే ఉన్నాం. రేపు మీరే ఆ బాధితులు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా సైబర్ అటాకర్లు పంజా విసురుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడేవారే వీరి మెయిన్ టార్గెట్. రోజంతా ఫోన్ వాడే వారిని టార్గెట్ చేసి మొత్తానికి బురిడీ కొట్టించేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. వీరి మోసాలను ఓ ట్రిక్ ద్వారా కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..
ఇలాంటి వారే టార్గెట్..
ఆన్ లైన్ పేమెంట్స్, షాపింగ్ బిల్స్, టికెట్ బుకింగ్స్ అంటూ నిత్యం ఏదో ఒక ట్రాన్ సాక్షన్ చేసేవారు ఈ వార్త మిస్సవ్వకండి. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే హ్యాక్ అయ్యి ఉండొచ్చు. లేదంటే కేటుగాళ్లకు మీరు టార్గెట్ గానూ ఉండొచ్చు. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయి ఉంటే ఈ చిన్న ట్రిక్ ద్వారా కనిపెట్టేయొచ్చు.
ఇలా కనిపిస్తే డేంజర్లో ఉన్నట్టే..
చాలా మంది మీ డబ్బులు కాజేయడానికి ముఖ్యంగా చేసే పని మీ సీక్రెట్ పాస్ వర్డ్స్ ను, డేటాను దొంగిలించడమే. ఇందుకు వీరి దగ్గరున్న ఆయుధం మీ స్క్రీన్ ను మీకు తెలియకుండా రికార్డ్ చేయడమే. ఇలాగే మీ వ్యక్తిగత డేటాను దొంగలించి మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడమో లేక పాస్ వర్డ్ చోరీ చేసి అకౌంట్ ఖాళీ చేయడమో చేస్తుంటారు. మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైతే మీ ఫోన్ స్క్రీన్ పై గ్రీన్ కలర్ లో ఒక చుక్క కనపడుతుంది. ఇది మైక్ లేదా కెమెరా ఆన్ చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫోన్ రికార్డు అవుతుందని తెలిపే సంకేతం. మీరు ఇలా కనిపించినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే స్పందించి అలెర్టవ్వండి. మీ సెక్యూరిటీ సెట్టింగ్స్ ను సెట్ చేసి యాక్సెస్ ను పరిమితం చేయండి. కెమెరాకు, మైక్ కు ఏదైనా కొత్త యాప్ లు యాక్సెస్ ఇచ్చి ఉన్నాయా అనే విషయం చెక్ చేసుకోండి.