ఆవు పేడ కుప్పలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా డబ్బు దొరికింది. పేడ కుప్పలో అంత డబ్బు దాచిపెట్టడం ఏంటని సందేహంగా ఉందా? ఇదంతా దొంగ సొమ్ము. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా డబ్బును దొంగిలించాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొన్నారు. బాలాసోర్ జిల్లాలో ఉన్న బాదమందరుని గ్రామంలో నిందితుడి అత్తమామలు ఉంటారు. వారి ఇంట్లో ఉన్న ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు.
ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా
హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు జరిపిన సోదాల్లో శనివారం ఈ నగదు బయటపడింది. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు. డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. హైదరాబాద్ లోని వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
డబ్బుని తన బావ రవీంద్ర బెహెరా చేతికి ఇచ్చి గ్రామానికి పంపించాడని, కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు ఎక్కడుందో తెలిసిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రేమదా నాయక్ ప్రకటించారు. నిందితులు గోపాల్, అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారయ్యారని తెలిపారు. గ్రామంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని ప్రేమదా నాయక్ తెలిపారు.
ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..