సాధారణంగా పామును చూస్తేనే గుండె జల్లుమంటుంది. అదే భయంకరమైన, అతిపెద్ద గిరినాగును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అనకాపల్లి జిల్లా విమాడుగుల శివారులో గిరినాగు కలలకలం రేపింది. ప్రపంచంలోనే విషపూరితమైన 12 అడుగుల గిరినాగు ఓ రైతు పొలం గట్టుపైన చెట్టుకింద నీటి తొట్టి పక్కన కూర్చుని ఉంది. అటుగా వెళ్లిన రైతు నీటితొట్టి పక్కన ఉన్న గిరినాగును చూసి భయంతో ఉలిక్కిపడ్డాడు.
దెబ్బకు అక్కడినుంచి పరుగులు తీశాడు. చినబాబు అనే రైతు ఎప్పటిలాగే పొలంలో పని చేసుకునేందుకు వెళ్లాడు. అక్కడ పొలంలో పనిచేసుకొని గట్టుపైకి వచ్చిన అతను అక్కడ నీటి తొట్టి పక్కన చుట్టలా చుట్టుకొని కూర్చున్న గిరినాగును చూసి రైతు భయంతో వణికిపోయాడు. వెంటనే అక్కడి పక్క పొలంలో పనిచేస్తున్న రైతులకు విషయం చెప్పాడు. కొందరు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. వారు స్నేక్ క్యాచర్‌ను వెంటపెట్టుకొని పొలానికి వచ్చారు. గిరినాగును బంధించే క్రమంలో తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??
నడి సముద్రంలో ఇంజనీరింగ్ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్
TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్