ప్రపంచంలో చాలా మంది భవిష్యత్ గురించి చెప్పే బాబాలు ఉన్నారు. వారిలో బాబా వంగా ఒకరు. అయితే ఆవిడ జోస్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రపంచంలో జరిగే సంఘటనలను బాబా వంగా ముందుగానే ఊహించారు. ఇప్పటివరకు ఆవిడ చెప్పిన చాలా జోస్యాలు నిజమయ్యాయి.
Baba Vanga
Updated on: Feb 07, 2025 | 9:15 PM
బల్గేరియాకు చెందిన బాబా వంగా 12 సంవత్సరాల వయస్సులో కంటి చూపుని కోల్పోయారు. కానీ దృష్టి పోయిన తర్వాత ఆవిడకి భవిష్యత్తును అంచనా వేసే శక్తి వచ్చిందని చెబుతారు. ఆవిడ చనిపోయే ముందు ప్రతి సంవత్సరం జరిగే సంఘటనలను ఊహించి.. వాటిని నోట్సులో రాశారు.
ఇప్పటివరకు ఆవిడవి చాలా భవిష్యత్ జోస్యాలు నిజమయ్యాయి. కాబట్టి ప్రతి కొత్త సంవత్సరం రాకముందే ఆ సంవత్సరంలో ఎలాంటి మంచి, చెడు జరుగుతుందో బాబా వంగా జోస్యం ద్వారా తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉంటారు.
2025 సంవత్సరానికి బాబా వంగా జోస్యం
2025 సంవత్సరానికి బాబా వంగా జోస్యం కొంచెం భయానకంగా ఉంది. ఎందుకంటే 2025 లో ప్రపంచ నాశనం ప్రారంభమవుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు.
మానవజాతి పతనం
- 2025 లో పెద్ద ఘర్షణలు, విషాదకరమైన సంఘటనలు జరుగుతాయని బాబా వంగా జోస్యం చెప్పారు. ఇది మానవజాతి పతనానికి దారి తీస్తుందని చెప్పారు. అదే విధంగా ఐరోపాలో విపత్తుకు ఘర్షణ వస్తుందని ఆవిడ జోస్యం చెప్పారు. ఈ ఘర్షణ ఐరోపా ఖండానికి పూడ్చలేని నష్టం కలిగిస్తుందని ఆవిడ జోస్యం చెప్పారు.
- 2025లో ఘర్షణ కారణంగా జనాభా గణనీయంగా తగ్గుతుంది. ఆ తర్వాత 2028 లో మానవులు కొత్త వనరుల కోసం వీనస్ గ్రహానికి చేరుకుంటారని బాబా వంగా జోస్యం చెప్పారు.
- తర్వాత 2033లో అతిపెద్ద హిమానీ నదాలు కరుగుతాయని.. దీనివల్ల సముద్ర మట్టం పెరుగుతుందని ఆవిడ జోస్యం చెప్పారు. దీంతో పెద్ద అలలు వచ్చి ప్రాణనష్టం కలుగుతుందని ఆవిడ తెలిపారు.
- అంతేకాకుండా.. 3797 సంవత్సరంలో భూమి నుండి జీవులు విడిపోతాయని.. చివరకు 5079 సంవత్సరంలో ప్రపంచం మొత్తం నాశనమవుతుందని చెప్పారు. అప్పుడు మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుందని ఆవిడ జోస్యం చెప్పారు.