3 బంతుల్లో 30 పరుగులు ఇచ్చిన స్టార్ బౌలర్.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఎవరంటే?

2 hours ago 1

Dasun Shanaka spent 30 runs successful 3 balls successful Abu Dhabi T10 match: శ్రీలంక మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ దాసున్ షనక వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం సానుకూలమైనది మాత్రం కాదండోయ్. వాస్తవానికి, అబుదాబి టీ-10 లీగ్‌లో ఆడుతున్న షనక విషయంలో ఊహించనిది చోటు చేసుకుంది. ఆ తర్వాత అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపణలు గుప్పతిస్తున్నారు. అత్యధికంగా 48 టీ-20 ఇంటర్నేషనల్స్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన షనక గత ఏడాది మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణలు ఆయన ప్రతిష్టను దిగజార్చాయి. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..

దసున్ షనక 3 బంతుల్లో 30 పరుగులు..

ఢిల్లీ బుల్స్‌తో జరిగిన 10 ఓవర్ల మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన షనక.. తొలి మూడు బంతుల్లో 30 పరుగులు ఇచ్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ సంధించాడు.

ఇవి కూడా చదవండి

ఫిక్సింగ్ చేశారని ఆరోపించిన ఫ్యాన్స్..

ఈ ఓవర్ తర్వాత, సోషల్ మీడియాలో అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. 4 నోబాల్స్‌ వేయడమే ఇందుకు కారణం అంటూ చెబుతున్నారు.

Dasun Shanaka – 4 No balls successful an over. @ICC This T10 league is becoming a gag and each benignant of chances for fixing. 33 runs and 4 nary balls from a subordinate similar Shanaka!! pic.twitter.com/zll01wjACx

— Sandeep (@sandeep_Vishu) November 25, 2024

ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “స్పష్టంగా ఇవి నో-బాల్స. ఈ లీగ్‌లను ICC దర్యాప్తు చేయాలి. ప్రస్తుతం దసున్ షనక శ్రీలంక కెప్టెన్‌గా ఉండటం చాలా విచిత్రం.” అంటూ రాసుకొచ్చాడు.

Well done dasun shanaka maan gaye bhai nary balls ki enactment lagadi 33 runs successful 1 implicit 😂 pic.twitter.com/FakZTXqxUc

— SAGAR THE TIPSTER (@GunjkarSagar) November 25, 2024

మరో వినియోగదారు “అబుదాబి T10 లీగ్‌లో ఇలా కూడా ఫిక్సింగ్ ఉంటుందా? దాసున్ షనక ఒక ఓవర్‌లో నాలుగు నో-బాల్‌లు వేయడమేంటి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను శ్రీలంకకు ఎప్పుడూ నో-బాల్ వేయలేదు” అంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article