Acid Attack: మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి.! వీడియో వైరల్..

2 hours ago 1

 మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి.! వీడియో వైరల్..

|

Updated on: Oct 11, 2024 | 7:51 PM

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో దారుణం జరిగింది. మాజీ ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఇద్దరూ రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మాజీ ప్రియుడిపై యాసిడ్ చల్లింది. దీంతో ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మాజీ ప్రియుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితురాలు, పోలీసులు కొన్ని కీలక వివరాలు తెలియజేశారు. అలీగఢ్ లోని ఓ రెస్టారెంట్ కు శనివారం ఉదయమే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు.

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో దారుణం జరిగింది. మాజీ ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఇద్దరూ రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మాజీ ప్రియుడిపై యాసిడ్ చల్లింది. దీంతో ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మాజీ ప్రియుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితురాలు, పోలీసులు కొన్ని కీలక వివరాలు తెలియజేశారు. అలీగఢ్ లోని ఓ రెస్టారెంట్ కు శనివారం ఉదయమే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ కు ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యువతి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి యాసిడ్ బాటిల్ తీసి యువకుడి ముఖంపై చల్లింది.

దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువకుడు తన మాజీ ప్రియుడని, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడడంతో తట్టుకోలేకే ఇలా చేశానని యువతి చెప్పింది. తనకు ఇదివరకే వివాహం జరిగిందని, విడాకులు తీసుకున్నానని పోలీసులకు వివరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరయ్యానని, అతడి తీరు నచ్చక దూరంగా ఉంటున్నానని చెప్పింది. అయితే, విడిపోయినా తనను వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయానని యువతి తెలిపింది. కాగా, ఈ దాడిలో యువతికి కూడా యాసిడ్ గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స చేయించాక అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article