Actress: దివంగత వైఎస్సార్‌తో ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఈ మధ్యన తరచూ వార్తల్లో..

2 hours ago 1

పై ఫొటోలో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పక్కన ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇమె టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్. 2006లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ నటి సుమారు 20కు పైగా సినిమాలు చేసింది. నాగార్జున, శ్రీకాంత్, గోపీచంద్‌, వెంకటేష్ తదితర హీరోలతో కలిసి పనిచేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లోను మెరిసి అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిందీ అందాల తార. అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అయితే సినిమాల్లో నటించకున్నా ఈ మధ్యన బాగా వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ. తన సంచలన పోస్టులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఓస్టార్ డైరెక్టర్ పై ఆమె చేస్తోన్న ఆరోపణలు టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ హీరోయిన్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు తన సోషల్ మీడియా పోస్టులతో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్. ఇది ఆమె త్రో బ్యాక్ ఫొటో.

కాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడుమాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలను బాగా అభిమానిస్తుంది పూనమ్ కౌర్. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. ఇక జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టింది. అయితే ఈ మధ్యన ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై పూనమ్ వరుసగా సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇవి టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. 2006లో ఒక విచిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్‌ కౌర్‌. ఆ తర్వాత మాయాజాలం, శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేశ్‌, నాగవల్లి, పయనం, గగనం, అటాక్‌, నాయకి, శ్రీనివాస కల్యాణం తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ లేటెస్ట్ ట్వీట్..

🔰Knotted Gun Peace Symbol : Non-Violence is an important bid awesome astatine the UN Headquarters.#internationaldayofnonviolence #gandhijayanti pic.twitter.com/dWPe2JdxDU

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2024

మహవీర్ టెంపుల్ లో పూనమ్ కౌర్..

Memories from #mahavir temple successful telangana – station doing seva of cleaning , on with elders and learning astir gou mata , practises inculcated by elders – beauteous portion of Indian civilization and ethos – #SanatanaDharma pic.twitter.com/26jjZJCvpA

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 28, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article