వారంత ఖాకీలు.. కేసులు , గొడవలు, శాంతి భద్రతలంటూ నిత్యం బిజిబిజిగా గడిపే ఉద్యోగులు. అలాంటి పోలీసు సిబ్బంది బాస్ ముందు డ్యాన్స్ లేస్తే ఎలా ఉంటుంది.. వామ్మో ఇంకా ఏమైనా ఉందా ఉద్యోగానికి హుష్టింగే.. కానీ అక్కడ మాత్రం అలా జరగలేదు. జిల్లా బాస్ తో కలిసే ఫుల్ జోష్ లో స్టెప్పులేశారు. జూనియర్లు సీనియర్లు అన్న భేదం లేకుండా అంతా కలిసి ఆడిపాడారు. పుల్ జోష్ లో డీజే పాఠల మోతల్లో స్టెప్పులేసి వాహ్ అనిపించారు. ఈ దృశ్యం కనువిందు చేసింది ఎక్కడో తెలుసా అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో. కొత్త పెళ్లి కొడుకుగా జిల్లాలో అడుగు పెట్టిన జిల్లా పోలీస్ బాస్ పెళ్లి వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వివాహం గత శనివారం ఆయన సొంత రాష్ట్రంలో బీహార్ లో ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాకు సతీసమేతంగా చేరుకున్నారు ఎస్పీ గౌస్ ఆలం. కొత్త పెళ్లికొడుకుగా జిల్లాకు చేరుకున్న ఎస్పీ కి బ్యాండ్ బాజాలతో ఘన స్వాగతం పలికారు పోలీస్ సిబ్బంది. డీఎస్పీలు సిఐలు మైలా పోలీసులు పెద్ద ఎత్తున ఎస్పీ బారాతిలో పాల్గొని కొత్త దంపతులకు పుష్పగుచ్చాలు అందజేసి జిల్లాకు స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాసేపు హోదాను మరిచి అంతా జోష్ లో డ్యాన్స్ లు వేశారు.
ఎప్పుడు బిజిబిజీగా గడిపే పోలీసులు నయా జోష్ లో కనిపించడం ఆకట్టుకుంది. జూనియర్లు సీనియర్లు అన్న భేదం లేకుండా అంతా కలిసి ఫుల్ జోష్ లో కనిపించారు. హోరెత్తించే డీజే ల మోతల్లో తమదైన స్టైల్ లో బ్రేక్ డ్యాన్స్ లేసి వాహ్ అనిపించారు పోలీస్ సిబ్బంది. సిబ్బంది జోష్ ను మరింత పెంచేలే కైకా పాను భనారసు వాలా అంటూ తన దైన స్టైల్ లో స్టైప్పులేసి వాహ్ అనిపించారు ఎస్పీ గౌస్ ఆలం.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి