IND vs ENG 3rd ODI: చివరి వన్డేలో 2 కీలక మార్పులతో బరిలోకి.. సిరీస్ విజయంపై కన్నేసిన భారత్

2 hours ago 1

India vs England 3rd ODI Match Playing 11 Prediction: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి వన్డే ఫిబ్రవరి 12, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత జట్టు సిరీస్‌ను గెలుచుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచింది. ఫిబ్రవరి 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

ఇప్పుడు, టీం ఇండియా వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫాంకు ముగింపు పలకాలని కూడా భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించే కోహ్లీ పరుగులు సాధిస్తే, అది ఆతిథ్య జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

తొలి రెండు వన్డేల్లో భారత్ 4 వికెట్ల తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది, కానీ, రోహిత్ శర్మ సేన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన నరేంద్ర మోడీ స్టేడియంలో విజయం సాధించేందుకు బరిలోకి దిగనుంది.

ఇవి కూడా చదవండి

ఈ వన్డేతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, ఇంగ్లాండ్ జట్ల సన్నాహాలకు తెర పడనుంది. ఎనిమిది జట్లు పోటీ పడనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న కరాచీలో ప్రారంభమవుతుంది. హైబ్రిడ్ హోస్టింగ్ మోడల్ ప్రకారం ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

మూడో వన్డే కోసం భారత జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేయవచ్చు అని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను, వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ప్రయత్నించవచ్చు. భారత్ తరపున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. విరాట్ కోహ్లీ జట్టులో ముఖ్యమైన బ్యాట్స్‌మన్. స్పిన్ బౌలింగ్‌కు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తుండగా, ఫాస్ట్ బౌలింగ్‌కు హర్షిత్ రాణా, మహ్మద్ షమీ నాయకత్వం వహిస్తారు.

మరోవైపు, ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఇంగ్లాండ్ తరపున ఓపెనర్లుగా అడుగుపెట్టవచ్చు. బ్యాటింగ్ లైనప్‌లో జో రూట్ కీలక పాత్ర పోషిస్తాడు. ఆదిల్ రషీద్ స్పిన్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తుండగా, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్ ఫాస్ట్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తారు.

ఇండియా vs ఇంగ్లాండ్ 3వ వన్డే ప్రాబబుల్ ప్లేయింగ్ XI జట్లు..

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.

ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article