ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెలలో బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై అధికారులతో చర్చించారు. 22 వేల కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రం బాధల్లో ఉన్న ముందుకు వెళ్తున్నాం.. బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలని… డబ్బులు లేవని పనులు ఆపొద్దన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇక డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే ఏపీలో డీఎస్సీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఆర్ అండ్ బీపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఏపీలో రోడ్లపై గుంతలు కనిపించకూడదు అధికారులకు సూచించారు. నాలుగేళ్లలో రహదారులు మొత్తం బాగు పడాలని.. గతంలో రోడ్లపై వెళ్లాలంటే భయం వేసేది.. త్వరలో ఆ గుంతలు లేకుండా చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరపాలన్నారు. ఈ నెలాఖరులోగా రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి