Updated on: Feb 12, 2025 | 12:55 PM
దక్షిణాది రాష్ట్రాల ఆలయ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఆయన, అనంత పద్మనాభస్వామి, మదురై మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఉన్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు పవన్. మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పవన్. ఆయన వెంట కుమారుడు అకీరా, టీటీడీ మెంబర్ ఆనంద్‌సాయి ఉన్నారు. 4 రోజుల పాటు, 11 ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకానున్నారు. అలాగే టెంపుల్ టూర్ కోసం దీక్ష వస్త్రాలు ధరించారు పవన్ కల్యాణ్. అటు తిరుమల లడ్డూ వివాదం దురదృష్టకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆలయాల నుంచి ఎవరూ లాభాలు ఆశించకూడదన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి