మహా కుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇవాళ మాఘ పూర్ణిమను పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల తాకిడి ఎక్కువైంది. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో జరిగిన మహాకుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అంచనాలను మించి పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. బుధవారం రోజంతా ఈ పుణ్యస్నానాల క్రతువు కొనసాగుతుంది.
మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకుంటున్నారు. కాగా, ఆ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 12న జరుపుకునే మాఘ పూర్ణిమ పెద్ద పుణ్యదినాలలో ఒకటి కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి మహా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో విస్తృత ఏర్పాట్ల మధ్య లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల పాటు జరిగే కల్పవాసులు కూడా ముగుస్తాయి. దాదాపు 10 లక్షల మంది కల్పవాసులు మహా కుంభ్ నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు. అన్ని కల్పవాసులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అధికారం కలిగిన పార్కింగ్ స్థలాలను మాత్రమే ఉపయోగించాలని పరిపాలన అభ్యర్థించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..