సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకుంటూ.. వరుస ఆఫర్స్ ను అందుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల, కృతిశెట్టి, రష్మిక మందన్న, మీనాక్షి చౌదరి ఇలా ఇంకొంతమంది ముద్దుగుమ్మలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. అంతే కాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. కానీ కొంతమంది మాత్రం హిట్స్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. అందం అభినయం ఉన్నా కూడా అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక్క హిట్ పడితే తిరిగి ఫామ్ లోకి రావడానికి ఎదురుచూస్తున్న భామల్లో ఈ చిన్నది ఒకరు. దాదాపు 11ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది ఈ అమ్మడు కానీ హిట్స్ మాత్రం లేవు. ఒక్కటంటే ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. ఆమె ఎవరంటే..
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్, అందం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. అది లేక చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు అందుకోలేకపోతున్నారు. వారిలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేష్ , ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నభా నటేష్ తన గ్లామర్ తో హైలైట్ గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కానీ అంతగా హిట్ అందుకోలేకపోయింది. రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా చేసిన అది హిట్ అవ్వలేకపోయింది.
అయితే నభా నటేష్ కు యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్ నుంచి కోలుకొని సినిమాలు చేస్తుంది. మొన్నామధ్య నభా నటించిన డార్లింగ్ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం నిఖిల్ న ఆడిస్తున్న స్వయంభు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పైనే నభా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
నభా నటేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.