Maha Shivaratri 2025 Horoscope: ఫిబ్రవరి నెల 26న మహా శివరాత్రి నుంచి మార్చి 14న ఏర్పడబోయే పౌర్ణమి వరకు కొన్ని రాశులకు గ్రహాల స్థితిగతులు బాగా అనుకూలంగా మారబోతున్నాయి. దీని ప్రభావంతో మహా శివరాత్రి నుంచి సుమారు 18 రోజుల పాటు కొన్ని రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలు పట్టబోతున్నాయి. దీంతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
Maha Shivaratri 2025
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 12, 2025 | 3:34 PM
ఈ నెల 26న సంభవించబోయే మహా శివరాత్రి నుంచి మార్చు 14న చోటు చేసుకోబోయే పౌర్ణమి వరకు కొన్ని రాశులకు గ్రహాల స్థితిగతులు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. మహా శివరాత్రి నుంచి సుమారు 18 రోజుల పాటు మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలు పట్టడంతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. మొత్తం మీద అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరడం జరుగుతుంది. ఈ రాశులవారు 26వ తేదీ ఉదయం ఇంట్లోనే శివార్చన చేసుకోవడం మంచిది.
- మేషం: ఈ రాశికి లాభస్థానంలో చంద్ర సంచారంతో పాటు, శుక్రుడు మేష రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు, సమస్యలు చాలావరకు తీరిపో తాయి. ఉద్యోగంలో మీ సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలకు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
- వృషభం: చంద్రుడు భాగ్య స్థానంలోకి రావడంతో పాటు సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఊహించని రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభించడంతో పాటు సామాజికంగా కూడా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, గౌరవ మర్యా దలు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ధన లాభం కలగడానికి అవ కాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి.
- కన్య: ఈ రాశికి పంచమలో చంద్రుడు, షష్ట స్థానంలో రవి, శనుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్తి కావలసిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా హోదాలు, జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యో గులకు దూర మప్రాంతంలో మంచిమ ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల భూ లాభం, ఆస్తి లాభం వంటివి కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత వాహనం కూడా అమరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు తమ ప్రాంతంలోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి.
- మకరం: ఈ రాశిలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడి సంచారం వల్ల అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి, కొన్ని బరువు బాధ్యతల నుంచి విముక్తి లభించి, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుప డుతుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురు తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్రుడు, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఊహించని ఆదాయ వృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి రెట్టింపు కావడం, వృత్తి, వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలను మించడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపరిమిత లాభాలను అందిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.
ఇవి కూడా చదవండి